చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని సింగిరి కోన వద్ద ఆలయానికి వెళుతున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేయడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి.
వడమలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులు మంజుల, సుబ్రహ్మణ్యంలంపై చిరుత దాడి చేసింది. గాయపడిన దంపతులు పుత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.