తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడి
14:25 August 04
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడి చేసింది. అలిపిరి నుంచి నాలుగో కిలోమీటర్ వద్ద ఇద్దరు వాహనదారులపై దాడి చేసింది. చిరుత దాడి నుంచి వాహనదారులు సురక్షితంగా తప్పించుకున్నారు. విజిలెన్స్ అధికారులు ఘటనాస్థలికి పెట్రోలింగ్ వాహనాన్ని పంపారు.
తిరుమల రెండవ కనుమ దారిలో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడి చేసింది. అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునే సమయంలో 4వ కిలోమీటరు వద్ద ఇద్దరు ట్రాఫిక్ పోలీసులపై, మరో స్థానికునిపై చిరుత డాడికి దిగింది. చిరుత దాడిని గుర్తించిన కానిస్టేబుల్... దానినుంచి తప్పించుకుని సురక్షితంగా కొండపైకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న తితిదే విజిలెన్స్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది చిరుత దాడికి దిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కనుమదారిలో ద్విచక్రవాహనాల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇదీ చదవండీ... అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు