కార్తీక మాసం పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అభిషేకం, దర్శనం వేళల్లో ఆలయ అధికారులు మార్పు చేశారు. ఉదయం నాలుగు గంటలకే ఆలయాన్ని తెరిచి ఐదు గంటలకు ప్రథమకాల అభిషేకం, సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
karthika masam: శ్రీకాళహస్తీశ్వర ఆలయం దర్శన వేళల్లో మార్పు - శ్రీకాళహస్తి ఆలయం సమాయాలు
కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం దర్శన వేళల్లో మార్పు చేశారు. ఉదయం నాలుగు గంటలకే ఆలయాన్ని తెరవనున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో రాత్రి 9 గంటలకు మిగిలిన రోజుల్లో 9.30కు పవళింపు సేవ దర్శనంతో ఆలయాన్ని మూత వేస్తారు.
s
మంగళ, బుధ, గురువారాల్లో రాత్రి 9 గంటలకు మిగిలిన రోజుల్లో 9.30కు పవళింపు సేవ దర్శనంతో ఆలయాన్ని మూత వేస్తారు. ఈ నెల 5 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఈ మార్పులు ఉంటాయని ఈవో పెద్దిరాజు తెలిపారు. రాహు, కేతు పూజలు యథావిధంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.