ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ తీరుపై చంద్రగిరి టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. వైకాపా నేతల బెదిరింపులకు ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలలో కొన్నింటిని చించేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తెదేపా నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రమణ్యం నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెదేపా సీనియర్ నాయకులు కుమార రాజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. వైకాపా నేతల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే అరాచకాలు: తెదేపా - chandragiri latest news
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై చంద్రగిరి తెదేపా నేతలు విమర్శలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణలో వైకాపా నాయకులు అరాచకాలు సృష్టించారని ఆరోపించారు.
ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే అరాచకాలు : తెదేపా నాయకులు