తిరుపతిలోని స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో పెచ్చులు ఊడిపడి ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల్లోనే ప్రమాదాలు చోటుచేసుకుంటుంటే.. కాలంచెల్లిన భవనాలలో ఉద్యోగుల పరిస్థితి ఏమిటి..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చంద్రగిరి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనాలు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారాయి. 20 పంచాయతీలున్న మండల పరిషత్ కార్యాలయ భవనం గోడలు బీటలువారి, పైకప్పు దెబ్బతిని పెచ్చులూడి పడుతున్నాయి. అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే కార్యాలయం మొత్తం జలమయమవుతోందని సిబ్బంది వాపోతున్నారు. మండల అభివృద్ధికి కృషిచేసే చోటే ఇలా ఉంటే.. ఇతర కార్యాలయాల పరిస్థితి ఎంటని ప్రజాప్రతినిధులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి.. ఏ ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదం పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం వీడరా..? - chandragiri mpdo office news
చంద్రగిరి మండల పరిషత్తు కార్యాలయం భద్రమేనా..? పగుళ్లు ఏర్పడి,పెచ్చులూడుతున్నా విధులు నిర్వహించాల్సిందేనా..? ప్రమాదం పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం వీడరా..? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా..? 20 పంచాయతీల అభివృద్ధి కోసం సమీక్షలు, సమావేశాలు నిర్వహించే కార్యాలయ పరిస్థితిపై ఈటీవీ భారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ప్రమాదం పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం వీడరా..?