ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం - చంద్రగిరి మార్కెట్ యార్డ్ తాజా వార్తలు

చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన పాలక మండలి సభ్యులుగా 16 మంది ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్​గా మస్తాన్, వైస్ చైర్మన్​గా కుప్పి రెడ్డి భాస్కర్​రెడ్డిని మరో 14 మందిని సభ్యులుగా చేర్చి కమిటీ ఏర్పాటు చేశారు.

Chandragiri Market Yard new committee
చంద్రగిరి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

By

Published : Jun 1, 2020, 3:19 PM IST


చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్ నూతన కమిటీతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా ఎన్నికైన సభ్యులు దూరం పాటిస్తూ ప్రమాణం చేశారు. నూతన పాలక మండలి సభ్యులుగా 16 మంది ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్​గా మస్తాన్, వైస్ చైర్మన్​గా కుప్పిరెడ్డి భాస్కర్​రెడ్డిని, మరో 14 మందిని సభ్యులుగా చేర్చి కమిటీ ఏర్పాటు చేశారు. వీరందరూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. చంద్రగిరి మార్కెట్ యార్డ్​ను రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్ యార్డ్​గా తీర్చిదిద్దాలని నూతనంగా ఎన్నికైన కమిటీకు ఎమ్మెల్యే సూచించారు.

ABOUT THE AUTHOR

...view details