ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వందేళ్ల చరిత్ర కలిగిన ఆ బడిని కొనసాగించాలి'.. ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ - ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ వార్తలు

చిత్తూరు జిల్లా కుప్పంలోని పాఠశాలల కోసం తెదేపా అధినేత చంద్రబాబు.. ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆర్.పేటలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కొనసాగించాలని కలెక్టర్‌, విద్యాశాఖ కమిషనర్, కార్యదర్శికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ
ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ

By

Published : Feb 18, 2022, 10:22 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం ఆర్​.పేట జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను విలీనం చేయవద్దంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చారిత్రక పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని లేఖలో పేర్కొన్నారు.

వందేళ్ల చరిత్ర కలిగిన పాఠశాలలో 440 మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. పాఠశాల విలీనాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఆర్.పేట పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకుని యథాస్థితిని కొనసాగించాలని లేఖలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details