చిత్తూరు మాజీ ఎంపీ, తెదేపా సీనియర్ నాయకుడు శివప్రసాద్ మృతిపై.. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు చిరకాల మిత్రుడిగా చెప్పారు. శివప్రసాద్ మృతి రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారం వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలను కోల్పోయామని ఆవేదన చెందారు. మరోవైపు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాయకుడిగా.. సినీ కళాకారుడిగా ప్రజల మనసు గెలుచుకున్నారని శివప్రసాద్‌ను కీర్తించారు.
మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూతపై చంద్రబాబు సంతాపం
మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూతపై.. తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సానుభూతి తెలిపారు.
babu tweet
శివప్రసాద్ సతీమణితో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. కుటుంబసభ్యులను ఓదార్చారు.శివప్రసాద్‌తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.సినీ, రాజకీయ రంగాల్లో శివప్రసాద్ రాణించారని చంద్రబాబు అన్నారు. శివప్రసాద్ మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని.. చిరకాల స్నేహితుడిని కోల్పోయినట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
Last Updated : Sep 21, 2019, 6:41 PM IST