ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు. ఇవాళ... వైకాపా బాధితులతో సమావేశం కానున్నారు. ఆరు నియోజకవర్గాల కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

By

Published : Nov 7, 2019, 6:51 AM IST

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇవాళ... వైకాపా బాధితులతో ప్రతిపక్ష నేత సమావేశం కానున్నారు. వైకాపా నేతల ఒత్తిళ్లు, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వారికి పార్టీ లీగల్‌ సెల్‌ నుంచి న్యాయపరమైన సలహాలు ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి పన్నెండు వరకు ఈ సమావేశం జరగనుంది. ఆ తర్వాత 6 నియోజకవర్గాల కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో విడివిడిగా భేటీ అవుతారు.

ABOUT THE AUTHOR

...view details