అండగా ఉంటా..!
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచేందుకు పార్టీ లీగల్ సెల్ నుంచి న్యాయపరమైన సలహాలు అందిస్తామన్నారు. ఎవరికి భయపడాల్సిన పనిలేదని.. ఎన్ని సమస్యలు సృష్టించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా చూడటం, ఆర్థికంగా వెసలుబాటు ఉన్న చోట దోచుకోవటం వైకాపా పాలన అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు.
అక్రమ కేసులను సమర్థంగా ఎదుర్కొంటాం: చంద్రబాబు - వైసీపీపై చంద్రబాబు ఫైర్
వైకాపా నేతల ఒత్తిళ్లతో పోలీసులు తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు...వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. వైకాపా బాధితులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్ని సమస్యలు ఎదురైనా... వాటిని సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. వచ్చే స్థానిక ఎన్నికల పాటించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అక్రమ కేసులను సమర్థంగా ఎదుర్కొంటాం : చంద్రబాబు