Chandrababu third day tour in Kuppam:ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం రౌడీ రాజ్యంగా తయారు చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పంలో తనకు లక్ష మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కోరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో రోజు పర్యటించిన చంద్రబాబు ముందుగా ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్తపేట మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసి మైనార్టీలతో సమావేశమయ్యారు. ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం రౌడీ రాజ్యంగా తయారు చేసిందని ధ్వజమెత్తారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీదే: చంద్రబాబు
Chandrababu Inaugurates Kanakadasau Statue:మధ్యాహ్నం నలగాంపల్లె మిట్ట వద్ద కనకదాసు విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం విగ్రహావిష్కరణకు హాజరైన కురబ సామాజిక వర్గీయులతో సమావేశమయ్యారు. కురబ కులస్థులకు స్ఫూర్తినిచ్చేలా కనకదాసు జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మనం ఎప్పుడూ నాగరికతను మరిచిపోకూడదని గుర్తుపెట్టుకొని భవిష్యత్ కోసం ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు. ఐటీలో కురబ కులస్థులు కూడా చాలామంది స్థిరపడ్డారని కొనియాడారు.
రాష్ట్రంలో కురబ కులస్థులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాదంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు బీమా ఇస్తామని తెలిపారు. వైసీపీ నాయకులు ఆలయ భూములను కూడా కబ్జా చేస్తున్నారని అక్రమంగా భూములు కబ్జాచేసిన వారు ఎవరైనా సరె వదిలిపెట్టేది లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ నేను వదిలిపెట్టినా ఆలయ భూములు కాజేస్తే దేవుడే శిక్షిస్తారని అన్నారు.