కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తెదేపాపై ఉందన్నారు. చిత్తూరు జిల్లా తెదేపా నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలకు అంతు లేకుండా పోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియోలో ఏదో తిట్టాడని బెదిరించి యువకుడి ప్రాణాలు తీస్తారా..? అని ప్రశ్నించారు. పుంగనూరు ఎస్సీ యువకుడి మృతదేహానికి పోస్టుమార్టమ్ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
'అంతకు మించిన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా' - chandrababu latest news
వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లాలో వైకాపా అరాచకాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఆత్మహత్యో, ఏది హత్యో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం నింపడమే తెలుగుదేశం పార్టీ సామాజిక బాధ్యతని గుర్తుచేశారు.
ఏది ఆత్మహత్యో, ఏది హత్యో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక జిల్లా చిత్తూరును వైకాపా అరాచకాల ఖిల్లా చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థి దశలో ఇక్కడే ఎన్నో పోరాటాలు చేశానన్న చంద్రబాబు... మళ్లీ అంతకు మించిన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 'పసుపు చైతన్యం' 100 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రజల్లో చైతన్యం నింపడమే తెలుగుదేశం పార్టీ సామాజిక బాధ్యతని గుర్తుచేశారు.
ఇదీ చదవండీ... పలమనేరు, కలికిరిలో కొవిడ్ ఆస్పత్రులు: పెద్దిరెడ్డి