తెదేపా అధినేత చంద్రబాబునాయుడు "జమ్మూకశ్మీర్‍లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన ముగ్గురు జవాన్లలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ ఉండటం విచారకరమంటూ ట్వీట్ చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరణించిన జవాన్ల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలిచి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వీర మరణం చెందిన జవాన్లకు చంద్రబాబు నివాళి - telugu soldiers dead in jammukashmir news
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. వీర జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని కోరుతూ ట్వీట్ చేశారు.
జవాన్లకు నివాళులర్పిస్తూ చంద్రబాబు ట్వీట్