చిత్తూరు జిల్లా కుప్పంలో కొవిడ్ రోగులకు వైద్య సేవలు పెంచాలని కోరుతూ.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉండటంతో.. ఆయా రాష్ట్రాల నుంచి నిత్యం ప్రజల రాకపోకలు ఉన్నాయని గుర్తు చేశారు. తద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
కుప్పంలో వైద్య వసతులు పెంచండి: సింఘాల్‌కు చంద్రబాబు లేఖ - అనిల్ సింఘాల్‌కు చంద్రబాబు లేఖ
కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైద్య సేవలు పెంచాలని.. ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్‌కు లేఖ రాశారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సరఫరా తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలోని ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్లు పెంచాలని చంద్రబాబు కోరారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో పడకల స్థాయిని 150కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. అవసరాలకు అనుగుణంగా కరోనా పరీక్షల సదుపాయం కల్పించాలని లేఖలో కోరారు. టీకా రెండో డోసు తీసుకోవడంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు కొవిడ్‌పై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: