Chandrababu Kuppam Second Day Tour Updates:చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటించారు. నేటి పర్యటనలో ఆయన కుప్పం ఆర్‌అండ్‌బీ అతిధి భవనం వద్ద ప్రజల నుంచి భారీ ఎత్తున వినతులు స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి శాంతిపురం మండలానికి బయలుదేరారు.
Chandrababu Road Show in Shantipuram:శాంతిపురం మండలంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన గెలుపే లక్ష్యంగా ఇరుపార్టీల నేతలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గంలో 500 మందిపై అక్రమ కేసులు పెట్టారన్న చంద్రబాబు, రేపు తాను సీఎం అయ్యాక ఈ వైసీపీ నేతలను వదిలిపెట్టాలా? శిక్షించాలా? అని కుప్పం నియోజకవర్గం ప్రజల్నిచంద్రబాబు అడిగారు.
Chandrababu speech in Mahanadu: కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం కావాలి.. సమర శంఖం పూరించిన చంద్రబాబు
Chandrababu Comments:''కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పంలో అభివృద్ధి జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పంకు ఏం చేసిందో చెప్పాలి? మేం ఉంటే హంద్రీనీవా కింద ప్రతి ఎకరానికీ నీరు ఇచ్చేవాళ్లం. హంద్రీనీవా పూర్తి చేసేందుకు రాత్రి, పగలు కష్టపడ్డాం. మేం 87 శాతం పనులు పూర్తి చేస్తే, మిగతా 13 శాతం చేయలేకపోయారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. దోచిన డబ్బంతా వసూలు చేస్తాం. వైఎస్ జగన్ పాలనలో వీరు చేసిందల్లా రౌడీయిజం, భూకబ్జాలు, గ్రానైట్ దొంగ వ్యాపారం'' అని చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు.