ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే కార్మికుల ఆత్మహత్యలు' - chandrababu chittoor tour

ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఇసుక విధానాన్ని తక్షణమే రద్దు చేసి, ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. తెదేపా కార్యకర్తలపై పోలీసులు దాడిని చంద్రబాబు ఖండించారు.

బాధ్యతలేని ప్రభుత్వం వల్లే కార్మికుల ఆత్మహత్యలు : చంద్రబాబు

By

Published : Nov 6, 2019, 8:13 PM IST

చిత్తూరు జిల్లాలో పర్యటిస్తోన్న తెదేపా అధినేత చంద్రబాబు... నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. ఇవాళ తెదేపా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు... ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు.

ఇసుక ఉచితంగా ఇవ్వండి

వైకాపా ప్రభుత్వాన్ని ఇసుక ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నామని చంద్రబాబు అన్నారు. అప్పుడే కార్మికుల ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల గోడు సర్కారుకు పట్టడం లేదని ఆరోపించారు. దోమలపై యుద్ధం చేశారని ఎద్దేవా చేశారన్న చంద్రబాబు... పేదల ఆరోగ్యం కోసం ఆ రోజు అలా పోరాడడం వల్లే మలేరియా, డెంగీ, అంటువ్యాధులు ప్రబలలేదన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. బాధ్యత లేని ప్రభుత్వం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైకాపా విధానాల వల్లే వ్యవసాయం దిగాలు

జగన్‌ సీఎం అయ్యాక ప్రాజెక్టుల పనులన్నీ ఆగిపోయాయన్న చంద్రబాబు... ఎక్కడా తట్ట మట్టి తియ్యలేదు, కాంక్రీట్ వేయలేదని విమర్శించారు. సీఎం జగన్‌ చెప్పే పనులకు, చేసే వాటికి పొంతన లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులపై తెదేపా చేసిన ప్రతిపాదనలపైనే ఇప్పుడు ఆలోచిస్తున్నారన్నారు. రైతు భరోసా మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. వైకాపా విధానాల వల్ల వ్యవసాయం బాగా దెబ్బతిందని చంద్రబాబు ఆరోపించారు.

అన్యాయానికి వత్తాసు వద్దు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన.. రాక్షస పాలనను తలపిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి వస్తున్న తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం హేయమైనచర్యగా అభివర్ణించారు. తెదేపా కార్యకర్త హేమంత్​పై పోలీసుల దాడిని ఆయన ఖండించారు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా... భయపడేదిలేదన్నారు. పదవుల కోసం అన్యాయానికి వత్తాసు పలకొద్దని అధికారులకు చంద్రబాబు సూచించారు. అన్యాయానికి కొమ్ముకాస్తే... ఇతర అధికారులకు ఎల్వీ సుబ్రహ్మణ్యం స్థితే వస్తుందన్నారు.

ఇదీ చదవండి :

సింహాద్రి స్కెచ్‌ వేస్తే ఉచ్చులో పడాల్సిందే...

ABOUT THE AUTHOR

...view details