చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెదేపా నాయకుడు గురువయ్య నాయుడు మృతి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని..పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం బలోపేతానికి గురవయ్య విశేష కృషి చేశారన్నారు. శ్రీకాళహస్తి ఆలయ బోర్డు అధ్యక్షునిగా, జిల్లా రైతు సంఘం అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. గురవయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గురువయ్య నాయుడు మృతి పార్టీకి తీరని లోటు: చంద్రబాబు - గురవయ్య నాయుడు మృతి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెదేపా నాయకుడు గురువయ్య నాయుడు మృతి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఆలయ బోర్డు అధ్యక్షునిగా, జిల్లా రైతు సంఘం అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.

గరువయ్య నాయుడు మరణం పార్టీకి తీరని లోటు
Last Updated : Feb 1, 2021, 5:18 PM IST