ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోండి: ఈసీకి చంద్రబాబు విజ్ఞప్తి - Chandrababu latest news

తిరుపతి ఉపఎన్నికలో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందంటూ.. తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Chandrababu
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Apr 17, 2021, 7:27 AM IST

తిరుపతి ఉపఎన్నికలో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందంటూ తెదేపా అధినేత ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలింగ్​లో అవకతవకలు చేసేందుకు అధికార ప్రభుత్వం పెద్ద ఎత్తున బయటి వ్యక్తులను దించిందని ఆరోపించారు. వరుసగా ఫిర్యాదులు చేస్తున్నా... క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లోక్​సభ నియోజకవర్గంలోని అన్ని సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, నిఘా బృందాలు (ఎఫ్‌ఎస్‌టిఎస్) ద్వారా పెట్రోలింగ్ మరింత పెంచాలని కోరారు. పోలింగ్ కేంద్రాలు ఆక్రమించటం, రిగ్గింగ్, హింసను ప్రేరేపించేందుకు బయట వ్యక్తులు చొరబడటం వంటి ఘటనలు జరిగాయన్నారు. హోటళ్లు, లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ గెస్ట్ హౌస్​లను పర్యవేక్షించాలని సూచించారు. వాలంటీర్ల ద్వారా వైకాపా నేతలు చేయిస్తున్న డబ్బు, మద్యం పంపిణీని నివారించాలని కోరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ ఓట్లు పోలవకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details