చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వైకాపా బాధితులతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తమ తప్పులు బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే తమ అక్రమాలకు అడ్డుండదని భావిస్తున్నారనీ.. న్యాయం జరగదని తెలిస్తే ప్రజలు ఆగ్రహంతో ఎంతకైనా తెగిస్తారని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడ్డామని గుర్తు చేశారు.
ప్రజలను తెగించేలా చేయకండి: చంద్రబాబు - chandrababu chittore tour latest news
తమకు న్యాయం జరగదని భావిస్తే ప్రజలు ఎంతకైనా తెగిస్తారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. తమ అక్రమాలకు అడ్డు రాకూడదనే ప్రభుత్వం, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనులే చేస్తోందని మండిపడ్డారు.
![ప్రజలను తెగించేలా చేయకండి: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4988284-279-4988284-1573116252259.jpg)
చంద్రబాబు చిత్తూరు పర్యటన
Last Updated : Nov 7, 2019, 2:19 PM IST