గతంలో వైకాపాపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడన్న అక్కసుతో తెదేపా కార్యకర్తపై కేసులు పెట్టడం దారుణమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
కావాలనే.. ఇంటి పక్కవాళ్లతో తమ కార్యకర్త రాకేశ్‌పై తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. గొడవ సమయంలో ఇంట్లో లేని వ్యక్తిపై లేనిపోని సెక్షన్ల కింద కేసులు పెట్టారన్నారు. రాకేశ్‌పై కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.