రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో తెలుగుదేశం కార్యకర్త మురళిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెదేపా సానుభూతిపరులపై పదేపదే హింసాత్మక దాడులు జరుగుతున్నప్పటికీ.. దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చంద్రబాబు మండిపడ్డారు.
మురళిని ఈనెల 20న అపహరించిన వైకాపా నేతలు.. రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని ఆరోపించారు.