కుప్పం నుంచి అమరావతికి రావడమే దూరభారం అయితే ఇప్పుడు విశాఖకు వెళ్లాలంటే అక్కడి ప్రజలు ఎంత దూరం ప్రయాణించాలో ముఖ్యమంత్రి జగన్కు తెలుసా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలకు విలువైన కాలం వృథా కావడమే కాకుండా ధన వ్యయం, మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. గత 7 నెలలుగా రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని... ఆ రాయితో ఎదుటివాడిని కొట్టడమా, లేదంటే తన నెత్తిమీదే కొట్టుకోవడం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ జాతీయ కార్యాలయంలో కుప్పం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పంచాయతీలు, మండలాలు, వార్డుల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించాలని వారికి దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పని చేయాలని... యువతను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత ఉత్సాహంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ మీద నమ్మకం, నాయకత్వం మీద విశ్వాసంతోనే వరుసగా గత 7 పర్యాయాలు అత్యధిక మెజారిటితో కుప్పంలో గెలిపిస్తున్నారని గుర్తు చేశారు. అందుకే కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఒక నమూనాగా చేశామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పనులను అడ్డుకుంటుందో ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు.
'రాష్ట్రంలో పాలన... పిచ్చోడి చేతిలో రాయిలా మారింది'
వైకాపా ప్రభుత్వ పాలనపై చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖను రాజధానిగా చేయటం వల్ల కుప్పం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు.
చంద్రబాబు