చిత్తూరు జిల్లా కుప్పం ఘటనపై డీజీపీ గౌతం సవాంగ్‌కు..తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తమ పార్టీ నేతలపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి గురైనవారిని ఆస్పత్రిలో చేర్చుతుంటే అడ్డుపడ్డారని లేఖలో వెల్లడించారు. స్థానికంగా ఉన్న అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించడం వల్లే దాడి చేశారన్నారు. శాంతిభద్రతలు కాపాడేలా పోలీసుల చర్యలు ఉండాలని సూచించారు.
Chandrababu Letter To DGP: 'శాంతిభద్రతలు కాపాడేలా పోలీసుల చర్యలు ఉండాలి' - ysrcp
కుప్పంలో తెదేపా నేతలపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. శాంతిభద్రతలు కాపాడేలా పోలీసుల చర్యలు ఉండాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
chandra babu letter to DGP
కుప్పంలో తెలుగుదేశం నేతలపై వైకాపా కార్యకర్తలే దాడి చేశారని ఆయన ఆరోపించారు. స్థానిక తెలుగుదేశం నాయకులతో మాట్లాడిన చంద్రబాబు..గాయపడిన సోదరులు లోకేష్, శరవన్ కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. స్థానిక క్వారీల్లో అక్రమాలను ప్రశ్నించినందుకే.. వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: