చిత్తూరు కలెక్టర్ హరి నారాయణకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పూతలపట్టు మండలం పాలకూరులో భూఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పాఠశాల మైదాన స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. గుడిసెలు, నిర్మాణాలతో ఆక్రమణకు యత్నిస్తున్నారన్నారని తెలిపారు. భూఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను.. చంద్రబాబు కోరారు.