ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోదా తెమ్మంటే.. ఉక్కుకూ ఎసరు: చంద్రబాబు - chandra babu fires on ysrcp

కుప్పంలో ప్రజారదరణ చూస్తుంటే... పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతలు ఎంత బెదిరించారో అర్థమవుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గంలో తప్పుడు కేసులకు బలవుతున్నవారిని కాపాడుకునేందుకు తానే పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. రెండో రోజు సుడిగాలి పర్యటన చేసిన చంద్రబాబు... క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పోలీసులు లేకుండా కుప్పంలో ఒక్క వీధిలోనైనా  తిరగగలరా?
పోలీసులు లేకుండా కుప్పంలో ఒక్క వీధిలోనైనా తిరగగలరా?

By

Published : Feb 26, 2021, 1:25 PM IST

Updated : Feb 27, 2021, 4:40 AM IST

పోలీసులు లేకుండా కుప్పంలో ఒక్క వీధిలోనైనా తిరగగలరా?

కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు ప్రత్యేక హోదా తెమ్మని అడిగితే.. విశాఖ ఉక్కునూ పోగొట్టే పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్‌ తీసుకొచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీˆ ఛార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. ఉపకార వేతనాలు, విదేశీ విద్య, నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్‌, చంద్రన్న బీమా నిలిపేశారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేది రూ.10 వేలైతే.. లాక్కునేది రూ.30 వేలని మండిపడ్డారు.

పోలీసులు లేకుండా కుప్పంలో ఒక్క వీధిలోనైనా తిరగగలరా?

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, శాంతిపురం మండలాల్లో శుక్రవారం రెండో రోజు ఆయన కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. కుప్పం పట్టణం నుంచి శాంతిపురం, రామకుప్పం మీదుగా ర్యాలీగా వచ్చిన ఆయన ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని నాకు చెబుతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ అభిమానులు మిమ్మల్ని ఏదైనా చేస్తే తమ బాధ్యత కాదంటున్నారు. ఈ బెదిరింపులకు నేను భయపడాలా? నన్నే బెదిరిస్తావా? నీ చరిత్ర ఎంత? మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతున్నారు. పోలీసులు లేకుండా వీధుల్లోకి రండి.. నేనూ వస్తాను.. ప్రజలే నన్ను రక్షించుకుంటారు. ప్రజాబలం శాశ్వతం.. పోలీసు బలం కాదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

న్యాయం చేయలేదని చెల్లెళ్లే చెబుతున్నారు

సీఎం జగన్‌ తనకే న్యాయం చేయలేదని ఒక చెల్లెలు చెబుతోంది. మరో సోదరి తన తండ్రి హత్య కేసు ఏమైందని ప్రశ్నిస్తోంది. ఈ హత్యకు సూత్రధారిని నేనే.. నిశ్శబ్దంగా ఉండమని ముఖ్యమంత్రి అంటున్నారు. కేసును ఛేదించడానికి సీబీఐ విచారణ కావాలని మేం డిమాండ్‌ చేస్తే అతీగతీలేదు. కోడికత్తితో నన్ను హతమార్చాలని చూశారని నాడు జగన్‌ ఆరోపించారు. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ తెలియదు’ అని విమర్శించారు.

అతిథిగృహానికి విద్యుత్తు నిలిపివేత

కుప్పంలో నేను బస చేసిన అతిథిగృహానికి శుక్రవారం ఉదయం విద్యుత్తు నిలిపేశారు. జనరేటర్‌ వేయమంటే పని చేయడం లేదన్నారు. జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్న నాకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని.. ఇప్పుడు చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వార్డులను ఏకగ్రీవాలు చేసుకోవడానికి ఫోర్జరీ దస్త్రాలతో కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. కోర్టుకెళతామని కార్యకర్తలు అంటుంటే మీపై అయిదు కేసులు పెడతామని భయపెడుతున్నారు. మీరు 5 పెడితే.. మేం 50 కేసులు నమోదు చేయిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. రామకుప్పం పోలీసుస్టేషన్‌ ముందే చెబుతున్నా.. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎవరూ తట్టుకోలేరు. పుంగనూరు తలారి.. కుప్పాన్ని ఉరి తీస్తున్నారని విమర్శించారు. ఆయన పోలీసులనూ వదలరన్నారు. మేధావులు, యువత పోరాటానికి సన్నద్ధం కావాలని తెదేపా అధినేత పిలుపునిచ్చారు. రేషన్‌ బళ్లలో మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీని ముందుండి నడిపించడానికి నేను గేరు మారుస్తాను.. మీరు బండిలో కూర్చోండని చంద్రబాబు కార్యకర్తలతో అన్నారు. అవసరమైతే జైలుకెళ్లడానికైనా తాను సిద్ధమేనన్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ను ప్రచారానికి రప్పించండి
'జూనియర్‌ ఎన్టీఆర్‌ను ప్రచారానికి రప్పించండి. ఆయనతో కుప్పంలో ప్రచారం చేయించండి' అంటూ రామకుప్పం, రాజుపేటల్లో నిర్వహించిన రోడ్‌ షోలో కొందరు తెదేపా కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. తాను ఇప్పటి నుంచి మూణ్నెల్లకోసారి నియోజకవర్గానికి వస్తానని.. కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అవసరమైతే లోకేశ్‌, ఇతర నాయకులు కూడా ఇక్కడికి ప్రచారానికి వస్తారని శ్రేణులకు తెలిపారు.

ఇదీ చదవండి:

10 అంశాలతో తెదేపా పురపాలక ఎన్నికల మేనిఫెస్టో

Last Updated : Feb 27, 2021, 4:40 AM IST

ABOUT THE AUTHOR

...view details