ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 11 నుంచి 4రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లపై స్థానిక తెదేపా నేతలు సోమవారం సమీక్షించారు. ఈ నెల 11న బెంగళూరు మీదుగా రోడ్డుమార్గంలో కుప్పం రానున్న చంద్రబాబు 11, 12 తేదీల్లో కుప్పం మున్సిపాలిటీ, మండలంలో, 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో, 14న గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో పర్యటించి ప్రజలు, పార్టీ శ్రేణులతో మమేకమవుతారని నేతలు చెప్పారు.
Chandra babu: 11 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన - చంద్రబాబు కుప్పం పర్యటన అప్డేట్స్
ఈ నెల 11 నుంచి 4రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. పలు మండలాల్లో పర్యటించి ప్రజలు, పార్టీ శ్రేణులతో మమేకమవుతారని నేతలు తెలిపారు.
![Chandra babu: 11 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన chandra babu kuppam tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13263024-548-13263024-1633407751802.jpg)
chandra babu kuppam tour