రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికిచ్చిన భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలంటే... భూములు కొనివ్వాలని సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. చెరువులు పూడ్చి మరీ పేదలకు భూములివ్వడం ఏంటని ప్రశ్నించారు. అస్సైన్డ్ భూములు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు. విశాఖలో ఆరు వేల ఎకరాల అసైన్డ్ భూములు లాక్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం పేద ప్రజలపై దాడి చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
'ప్రభుత్వం పేదలపై దాడి చేస్తోంది'
వైకాపా ప్రభుత్వం పేదలపై దాడి చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికిచ్చిన భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నుంచి రాజధానిని మార్చే హక్కు ప్రభుత్వానికి లేదని చంద్రబాబు అన్నారు. అస్సైన్డ్ భూములు తీసుకునే అధికారం సర్కారుకు ఎవరిచ్చారని నిలదీశారు.
గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ వేయటాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. వైకాపా చర్యలతో రాష్ట్రం నుంచి లక్షా 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్మాద చర్యలతో సోలార్ పవర్ ప్రమాదంలో పడిందన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రులపై బురద చల్లుతున్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వ చర్యలపై తెదేపా పోరాటం చేస్తుందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు.
ఇదీ చదవండి:
న్యాయం కోసం వెళితే... సీఐ అసభ్యంగా ప్రవర్తించాడు..!