ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పుంగనూరులో వైకాపా నేతల తీరుపై ఎస్​ఈసీ, డీజీపీ చర్యలు తీసుకోవాలి' - ap panchayth elections latest news

"వైకాపా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేయాలి" అని పార్టీ నాయకులకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పుంగనూరుకు చెందిన పార్టీ నేతలతో ఆయన టెలీకాన్పెరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలోని సదుం, సోమల మండలాల్లో తెదేపా బలపరిచిన అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైకాపా అడ్డుకుంటోందని స్థానిక నేతలు.. చంద్రబాబు దృష్టికి తెచ్చారు. వీటిన్నింటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని స్థానిక నేతలకు చంద్రబాబు సూచించారు.

chandra babu on punganur incident
chandra babu on punganur incident

By

Published : Feb 8, 2021, 3:15 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నేతల వ్యవహారశైలిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. పుంగనూరు తెదేపా నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అక్రమాలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేయాలని నాయకులకు సూచించారు.

నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను పోలీసులే బెదిరిస్తున్నారని... 26 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు మంత్రి పెద్దిరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. "వైకాపా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేయాలి" అని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details