చిత్తూరు జిల్లా కలికిరిలో గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. అందులో భాగంగా నిర్వహించిన చాందిని బండ్ల ప్రదర్శన అలరించింది. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన బండ్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆనందపరవశుల్ని చేశాయి. పిల్లనగ్రోవి, చెక్క భజనలు, కోలాటాలు, పండరి భజనలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
వైభవంగా ఎల్లమ్మ జాతర.. అలరించిన చాందిని బండ్లు - కలికిరి
చిత్తూరు జిల్లా కలికిరిలో గ్రామదేవత ఎల్లమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన చాందిని బండ్ల ప్రదర్శన ఆకట్టుకుంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
వైభవంగా ఎల్లమ్మ జాతర.. అలరించిన చాందిని బళ్లు