తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. జేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం నుంచి మంగళవాయిద్యాలు, చత్రచామర మర్యాదలతో తితిదే ఈవో జవహర్ రెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం సబేరా వద్ద అర్చకులు ఆయనను శేషవస్త్రంతో సత్కరించారు. కరోనా పరిస్థితుల్లోనూ శ్రీవారికి తితిదే శాస్త్రోక్తంగా సేవలు నిర్వహిస్తోందని విజయేంద్ర సరస్వతి అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తితిదే సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తితిదే ఏర్పాటు చేస్తుందన్నారు.
శ్రీవారి సేవలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి - thirumala updates
తిరుమల శ్రీవారి సేవలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. మంగళవాయిద్యాల నడుమ తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలు సుఖసంతోషా ఉండాలని తితిదే సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని విజయేంద్ర సరస్వతి తెలిపారు.
శ్రీవారి సేవలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి