కేవీబీ పురం, నగరి మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను తిరుపతిలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొంత కాలంగా 2 మండలాల పరిధిలో ఎక్కువ సంఖ్యలో దొంగతనాలకు సంబంధించిన ఫిర్యాదులు అందడం వల్ల నిఘాను కట్టుదిట్టం చేశామన్నారు. నిందితులు జయసూర్య, మనోజ్, వాసుదేవ్ ఆచారి అనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కేవీబీ పురం పోలీసులు చెప్పారు.
తిరుపతిలో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ - chittoor district latest crime news
తిరుపతిలో చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరిని కేవీబీ పురం పోలీస్ స్టేషన్కు తరలించారు. గత కొంత కాలంగా కేవీబీ పురం, నగరి మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వీరిపై నిఘా వేసి పట్టుకున్నట్లు పోలీసుల తెలిపారు.

చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్