ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ నష్టం అంచనా కోసం రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నివర్ తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి కేంద్ర బృందాలు రానున్నాయి. రెండు రోజుల్లో నాలుగు జిల్లాల్లో ఈ బృందాలు పర్యటిస్తాయి. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించనున్నాయని అధికారులు తెలిపారు.

nivar cyclone
nivar cyclone

By

Published : Dec 16, 2020, 10:38 PM IST

నివర్ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రానికి చేరుకోనున్నాయి. గురువారం, శుక్రవారం నివర్ తుపాను ప్రభావిత జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. గురువారం చిత్తూరు జిల్లాలో ఒక బృందం, నెల్లూరు జిల్లాలో మరో బృందం క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించనున్నాయి. అలాగే శుక్రవారం గుంటూరు జిల్లాలో ఒక బృందం, కడప జిల్లాలో మరో బృందం పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేయనున్నాయి.

గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి రానున్న కేంద్ర బృందం... తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్​లో నిర్వహించనున్న పవర్ పాయింట్ ప్రజంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్​లను తిలకిస్తారు. అనంతరం పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో వరద ప్రభావంతో గార్గేయ నదిపై వంతెన కొట్టుకుపోయిన ప్రాంతాన్ని బృంద సభ్యులు పరిశీలించనున్నారు. ఆ తరువాత సదుం మండలంలో గొంగివారిపల్లి వద్ద పాడైపోయిన పంటలను పరిశీలిస్తారు. చివరగా సోమల మండలానికి చేరుకుని ఇరికిపెంట చెరువును పరిశీలించి అక్కడ పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయనున్నారని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details