శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వాగతం పలికి ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గజేంద్ర సింగ్కు స్వర్ణముఖి నదిని చూపించారు. సుమారు 40 కిలో మీటర్ల మేర నదిని అభివృద్ధి చేసి చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల నీటి భూగర్భజలాలు పెరుగుతాయని కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు పంపితే కేంద్రంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
స్వర్ణముఖి నదిని సందర్శించిన కేంద్ర జలశక్తి మంత్రి - gajendra singh shekawat latest news
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి స్వర్ణముఖి నదిని సందర్శించారు.
స్వర్ణముఖి నదిని సందర్శించిన కేంద్ర జలశక్తి మంత్రి