కేంద్రమంత్రి పీయూష్ గోయల్... తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సేవలో పాల్గొన్న గోయల్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందచేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అంతకు ముందు ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పియూష్ గోయల్(Piyush Goyal), మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తిరమలేశుని దీవేనలు అందరీపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.