ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి - తిరుమలలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న కిషన్‌రెడ్డికి... ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

central-ministe
central-ministe

By

Published : Nov 14, 2020, 9:33 AM IST

Updated : Nov 14, 2020, 10:50 AM IST

తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న కిషన్‌రెడ్డికి.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్ర మంత్రి వెంట తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి ఉన్నారు. తిరుచానూరు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అమ్మవారి వాహనసేవను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

శుక్రవారం రాత్రి తిరుమల చేరుకున్న కిషన్​ రెడ్డిని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుమలలో దీపజ్యోతులు వెలిగించారు కిషన్ రెడ్డి. దీపావళి పండుగ సందర్భంగా అమరవీరుల బలిదానాలు గుర్తు చేసుకోవాలన్న ప్రధాని మోదీ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ దురాక్రమణలకు పాల్పడుతున్నాయన్న ఆయన.. జమ్ముకశ్మీర్​లో జరిగిన ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సరిహద్దుల్లో పాక్, చైనా ఆటకట్టించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:ఏపీ ప్రాజెక్డులపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

Last Updated : Nov 14, 2020, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details