ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''నీటి సంరక్షణ అందరి బాధ్యత'' - kuppam constituency

నీటి సంరక్షణ విధానాలపై అధ్యయనం చేయడానికి కేంద్రం నుంచి వచ్చిన జల్ శక్తి అభియాన్ బృందం.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో పర్యటించింది.

జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : జల్ శక్తి అభియాన్ బృందం

By

Published : Jul 19, 2019, 3:59 AM IST

జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : జల్ శక్తి అభియాన్ బృందం

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జల్​ శక్తి అభియాన్ బృందం... రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కరకట్ట పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన జల సంరక్షణ నిర్మాణాలను పరిశీలించింది. చెరువు పూడికతీత, గుంతల నిర్మాణం, చెక్ డ్యాంలు ఏర్పాటు పనులను పరిశీలించి రైతుల అభిప్రాయాలను తెలుసుకుంది. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఆరా తీసింది. అనంతరం కంగానపల్లి పంచాయతీ కేంద్రంలో గ్రామ సభకు బృంద సభ్యులు హాజరయ్యారు. జలసంరక్షణ ఆవశ్యకతను కేంద్ర బృందం సభ్యులు గిరిధర గోపాల కృష్ణ, సుదర్శన్ కుమార్ గ్రామస్థులకు వివరించారు. వర్షపు నీటిని సంరక్షించి భావితరాలకు నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. ఇది అందరి బాధ్యతగా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details