నివర్ తుపాను కలిగించిన పంటనష్టం అంచనా వేసేందుకు.. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కేంద్రబృందాలు పర్యటించనున్నట్టు రాష్ట్ర విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. గురువారం... చిత్తూరు జిల్లాలో ఒక బృందం, నెల్లూరులో మరొకటి.... శుక్రవారం గుంటూరులో ఓ బృందం.... కడప జిల్లాలో మరొక బృందం పర్యటిస్తుందన్నారు. ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ఓ ప్రత్యేకబృందం.... ఓ హోటల్‌లో నిర్వహించనున్న ప్రజంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్లలో పాల్గొననున్నారు. అనంతరం.. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో.... గార్గేయ నదిపై వంతెన కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. గొంగివారిపల్లి వద్ద పంటలను పరిశీలించనున్న కేంద్రబృందం... సోమల మండలానికి చేరుకుని ఇరికిపెంట చెరువును పరిశీలించి... పంటనష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయనుంది.
నివర్ తుపాను నష్టం అంచనా కోసం రాష్ట్రానికి కేంద్ర బృందాలు - చిత్తూరు జిల్లా వార్తలు
నివర్ తుపాను నష్టం అంచనా కోసం రాష్ట్రానికి కేంద్ర బృందాలు రానున్నాయి. చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కడప జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి.
చిత్తూరుకు కేంద్ర బృందం