ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ శవానికి దహనసంస్కారాలు ఎక్కడ చేయాలి? - స్మశానం వాటిక లేక దహనసంస్కారాలు ఇబ్బందులు

స్మశానవాటిక స్థలం ఆక్రమణకు గురవటంతో... ఓ వృద్ధుడు మృతదేహంతో తమ గ్రామానికి స్మశాన వాటికను కల్పించాలని కోరుతూ... కలెక్టరేట్ ఎదుట నలిశెట్టిపల్లె గ్రామస్తులు ధర్నా చేశారు.

ఈ శవానికి దహనసంస్కారాలు ఎక్కడ చేయాలి?

By

Published : Nov 5, 2019, 12:05 AM IST

ఈ శవానికి దహనసంస్కారాలు ఎక్కడ చేయాలి?

తమ గ్రామానికి చెందిన శ్మశాన వాటిక ఆక్రమణకు గురవడంతో మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించలేకపోతున్నామని.. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం నలిశెట్టిపల్లె గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన 63 ఏళ్ల వృద్ధుడు లోకయ్య శెట్టి మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్టి ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన రెండున్నర ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారని.. దీంతో దహన సంస్కారాలు నిర్వహించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం జిల్లా అధికారులు వారితో చర్చించి ఆందోళన విరమింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details