నెల రోజుల వ్యవధిలోనే ఫిర్యాదుదారులు పోగొట్టుకొన్న సుమారు 405 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ చోరీలకు సంబంధించి ఎనిమిది కేసులు నమోదు చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. బాధితులకు ఫోన్లు అందజేశారు.
రూ.60 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ
చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన రూ.60 లక్షల విలువైన 405 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్నికల్ ఎనాలిసిస్ వింగ్ ఈ రికవరీలో కీలక భూమిక పోషించినట్లు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.
మొబైల్ ఫోన్లు రికవరీ
నేర ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషించినట్లు చెప్పారు. గతంలో ఇదే విభాగం ద్వారా రూ. 40 లక్షలు విలువైన 277 సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. దీంతో ఇప్పటివరకు సుమారు రూ. కోటి విలువైన సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు వివరించారు. వీటిని ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి..రూ. 18 లక్షల విలువైన గంజాయి పట్టివేత