ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్​ఫోన్​ షాపులో దొంగతనం... నిందితులు అరెస్ట్​

జూలై నెలలో సెల్​ఫోన్​ దుకాణంలో దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

cell phone robbery case solved
28 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : Sep 28, 2020, 10:26 PM IST

సెల్​ఫోన్​ షాపులో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను మదనపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. మదనపల్లె పట్టణం నీరుగుంట వారి పల్లిలో జూలై నెలలో గుర్తు తెలియని వ్యక్తులు చరవాణీ దుకాణంలో చొరబడి సెల్​ఫోన్లు దొంగలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సెల్​ టవర్​ సిగ్నల్​ ఆధారంగా పోలీసులు బండి ప్రమోద్​, సాయినాథ్​ నాయక్​, శ్రీనివాస్​ నాయక్​లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 1.90 లక్షల నగదు విలువ గల 28 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్​ చేసినట్లు డీఎస్పీ రమణాచారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details