ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - vips visited tirumala news

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వీలైనంత త్వరగా రావాలని స్వామి వారిని ప్రార్థించినట్లు భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ ​దేవధర్ తెలిపారు.

Celebrities visited Thirumala
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

By

Published : Dec 11, 2020, 4:30 PM IST

పలిమారు మఠం పీఠాధిపతి శ్రీవిద్యాదీషా తీర్ధ స్వామిజీ, భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ ​దేవధర్​తో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల భాజపా జాతీయ కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. మానవ జాతి శ్రేయస్సు కోసం కరోనా వ్యాక్సిన్ వీలైనంత త్వరగా రావాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. వైరస్​ బారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని అన్నారు.

బాలాజీని దర్శించుకున్నవారిలో తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి సంపత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ ఉన్నారు.

ఇదీ చదవండి:అనంత స్వర్ణమయానికి స్వస్తి: తితిదే తీర్మానం

ABOUT THE AUTHOR

...view details