ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 5:28 AM IST

ETV Bharat / state

కరోనాపై అవగాహన కల్పించండి : చంద్రబాబు

పేద కుటుంబాలకు అండగా ఉండి అందరిలో మనోధైర్యం పెంచాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కుప్పం తెదేపా నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచి వ్యక్తిగత దూరం పాటించేలా చూడాలని కార్యకర్తలను కోరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కుప్పంలో కరోనా కేసులు లేకపోవడం సంతోషమన్న చంద్రబాబు... వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. లాక్ డౌన్, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు

పేద కుటుంబాలకు అండగా నిలిచి వారిలో మనోధైర్యం నింపాలని తెదేపా కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కొవిడ్ 19పై అవగాహన కల్పించి ప్రజలు వ్యక్తిగత దూరం పాటించేలా చూడాలని కార్యకర్తలను కోరారు. కుప్పం తెదేపా నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడుతుందని, కనీవినీ ఎరుగని విపత్తుగా కరోనా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కుప్పం ఉందన్న చంద్రబాబు.. ఆ రెండు రాష్ట్రాల్లో కేసుల ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రభుత్వానికి లేఖలు

కుప్పంలో కరోనా కేసులు లేవన్న చంద్రబాబు... వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లాక్​డౌన్, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు అన్నారు. పండ్లతోటలు, కూరగాయల రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. కూలీలు, రవాణా, ధరలేక టమోటా, అరటి, బొప్పాయి రైతాంగం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితులపై ప్రభుత్వానికి అనేక లేఖలు రాశామని, నష్టపోయిన వారిన ఆదుకోవాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి అన్నివర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్​లో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఏరియా కమిటీ కన్వీనర్లు, మండల పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో 400 దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details