చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ తెదేపా శ్రేణులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. పార్టీ పటిష్టత కార్యక్రమాల్లో కుప్పం ఆదర్శంగా నిలవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. కుప్పంపై ప్రభుత్వ కక్ష సాధింపును ప్రజలకు వివరించాలన్నారు. కుప్పం పర్యటనపై కార్యాచరణ రూపొందించాలని శ్రేణులకు..చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
CBN: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. కుప్పంపై ప్రభుత్వ కక్ష సాధింపును ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కుప్పం నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన..తన పర్యటనకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి