చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. 14వ వార్డు తెదేపా ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైకాపా నేతలు దాడిచేశారని లేఖలో పేర్కొన్నారు. నామినేషన్ దాఖలుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లగా..అక్కడే తమ పార్టీ అభ్యర్థిపై దాడి జరిగిందన్నారు. దాదాపు 30 మంది వెంకటేశ్‌పై దాడికి దిగి, నామపత్రాలు చించివేశారన్నారు.
CBN Letter To SEC:'కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు'..ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ - కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు న్యూస్
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. 14వ వార్డు తెదేపా అభ్యర్థి వెంకటేశ్‌పై వైకాపా నేతలు దాడి చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
దాడిలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారన్న చంద్రబాబు..అందుకు సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు భద్రత కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దాడిచేసిన వారిపై చర్యలకు ఆదేశించి..,తెదేపా అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చూడాలని చంద్రబాబు కోరారు.
ఇదీ చదవండి: కుప్పంలో టెన్షన్.. తెదేపా అభ్యర్థి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు