ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి: చంద్రబాబు - కుప్పం ఘటనపై ఎస్​ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని తెదేపా అధినేత చంద్రబాబు ఎస్​ఈసీని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి
ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి

By

Published : Feb 17, 2021, 5:50 PM IST

పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. గుడుపల్లి మండలం సోదిగానిపల్లె, రామకుప్పం మండలం పెద్దూరు గ్రామాల్లో స్థానికేతర వైకాపా నేతలు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎస్​ఈసీకి ఫిర్యాదు చేశారు. పెద్దూరులో రౌడీషీటర్ సత్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నందున అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వైకాపా గూండాల పట్ల పోలీసులు చోద్యం చూస్తూ కూర్చోవటం సరికాదని మండిపడ్డారు. అలజడులు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందు ప్రయత్నిస్తున్న వారిని నివారించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

ఎస్​ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details