హైదరాబాద్లోని తన నివాసంలో చంద్రబాబు యువతరం నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, పరిటాల రవి, ఎర్రన్నాయుడు, జ్యోతుల నెహ్రు, బాలయోగి, బొజ్జల, కరణం బలరాం, ప్రతిభా భారతి, బండారు సత్యనారాయణ మూర్తి, భూమా, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితర నేతల వారసులతో పాటు ఇతర యువ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత యువతరానిదేనని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు ఆది నుంచి తెలుగుదేశం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేశారు. మున్ముందు ఇదే కొనసాగుతుందని చెప్పారు.
'పార్టీని ముందుకు నడిపించే బాధ్యత యువతరానిదే'
హైదరాబాద్లోని తన నివాసంలో చంద్రబాబు యువతరం నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీని ముందుకు నడిపించే బాధ్యత యువతరానిదేనని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు యువతరం నాయకులతో ఆత్మీయ సమావేశం
యువతరం నాయకులతో కలిసి చంద్రబాబు కుటుంబ సభ్యులు భోజనం చేశారు. ప్రతి ఒక్కరితోనూ ముఖాముఖి నిర్వహించి పార్టీలో చురుగ్గా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం అంతా కలిసి సరదాగా ఫొటోలు దిగారు.
ఇవీ చదవండి