శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామంలో పశువుల పండుగను ఘనంగా ప్రారంభించారు. ఏటా సంక్రాంతికి పశువుల పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పశువులకు పోటీలు నిర్వహించారు. తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకునే పశువుల యజమానులకు బహుమతులు ప్రకటించారు. పోటీల్లో పాల్గొనేందుకు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో పశువులను తీసుకొచ్చారు. ఈ పోటీలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
కర్లగట్ట గ్రామంలో ఘనంగా పశువుల పండుగ - cattle festival news in chittoor district
చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ వాతవరణం ముందుగానే వచ్చింది. శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామంలో పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వందలాది పశువులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.
![కర్లగట్ట గ్రామంలో ఘనంగా పశువుల పండుగ http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/01-December-2019/5236042_864_5236042_1575202831873.png](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5236042-864-5236042-1575202831873.jpg)
చిత్తూరు జిల్లాలో ఘనంగా పశువుల పండుగ