చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కెనమాకులపల్లిలో పశువుల పండుగను ఘనంగా ప్రారంభించారు. ఏటా జనవరిలో సంక్రాంతి సందర్భంగా పశువుల పండుగను ఇక్కడ నిర్వహిస్తారు. అయితే ఇక్కడ నవంబర్ నెలలో పశువుల పండుగను కోలాహలంగా నిర్వహించడం విశేషం. తక్కువ సమయంలో నిర్ణయించిన దూరం పరిగెత్తే పశువుల యజమానులకు బహుమతులను ప్రకటించటంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో పశువులను తీసుకువచ్చి పరుగులు పెట్టించారు. పోటీలను చూసేందుకు వేలాదిగా జనం తరలిరావటంతో గ్రామం కిక్కిరిసిపోయింది. జనం మధ్యలో పరిగెత్తే పశువులను నిలువరించేందుకు యువత పోటీ పడ్డారు. అతి తక్కువ సమయంలో దూరాన్ని చేరుకున్న పశువుల యజమానులకు గ్రామస్థుల ఆధ్వర్యంలో నగదు బహుమతులను అందజేశారు. ఈ పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కెనమాకులపల్లిలో పశువుల పండుగ
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కెనమాకులపల్లిలో పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో పశువులను తీసుకువచ్చి పరుగుల పోటీలు పెట్టారు.
Cattle festival in chittoor district