చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామపంచాయతీ సర్పంచి బడి సుధాయాదవ్ రోడ్డుపై నిలిచిన బురద నీటితో స్నానం చేస్తూ.. రోడ్డు మరమ్మతులను చేపట్టాలని గత నెల 28వ తేదీన నిరసన కార్యక్రమం చేపట్టారు. సంవత్సరాలుగా పరిష్కారం దొరకని ఈ సమస్యకు ఒక్క నిరసనతో అధికారులు దృష్టికి చేరింది. మూడు రోజుల క్రితం తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేపట్టారు.
SARPANCH DEMAND: 'వారిపై కాదు.. నాపై కేసులు నమోదు చేయండి' - Pudiputla Sarpanchi protest news
సమస్య పరిష్కారం కోసం సర్పంచి వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. స్పందించిన అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. మరోవైపు సర్పంచి నిరసనకు మద్దతు తెలిపిన ప్రజలపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

మరోవైపు సర్పంచి చేసిన నిరసనకు మద్దతు తెలిపిన ప్రజలపై ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వీటిపై ఆసహనం వ్యక్తం చేసిన సర్పంచి సుధా యాదవ్.. తనకు మద్దతు తెలిపిన వారిపై కాకుండా.. తనపై కేసులు నమోదు చేయాలని పోలీసులు కోరారు. ఈ నిరసనకు మూలకారణం తానేనంటూ సాక్ష్యాధారాలను పోలీసులకు చూపించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరసన తెలిపితే... కేసులు బనాయించటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల అండదండలతో ప్రజలపై కాంట్రాక్టర్లు కేసులు పెట్టారని ఆరోపించారు.
ఇదీ చదవండి్