చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కురువకుప్పం నుంచి నాటుసారాను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రామచంద్రాపురం పోలీసులు అన్నుపల్లి వద్ద దాడులు నిర్వహించారు. ద్విచక్రవాహనంపై తిరుపతికి తరలిస్తున్న తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి, ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మండలంలోని వివిధ ప్రాంతాలలో దాడులు నిర్వహించి 200 లీటర్ల నాటుసారా, 21 ద్విచక్ర వాహనాలు, ఆటో, మహీంద్ర వ్యాన్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
నాటుసారా తరలిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు - చిత్తూరు జిల్లా వార్తలు
లాక్డౌన్ ప్రభావంతో రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. ఫలితంగా గ్రామాల్లో నాటుసారా తయారీ జోరందుకుంది. చిత్తూరు జిల్లా అన్నుపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి తొమ్మిదిమందిపై కేసు నమోదు చేశారు.
![నాటుసారా తరలిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు Case against nine persons to transport illeagale wine in chithoor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7032070-780-7032070-1588421308486.jpg)
నాటుసారా తరలిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు